Share News

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

ABN , Publish Date - Apr 09 , 2025 | 09:19 PM

కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల (2008 నవంబర్) నిందితుడు తహవూర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. తహవూర్‌కు అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన అవకాశాలన్నీ ముగియడంతో భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది. ఆయనను అప్పగించేందుకు లీగల్ ఫార్మాలిటీస్ కూడా అమెరికాలో పూర్తి కావడంతో భారత బహుళ ఏజెన్సీ టీమ్‌లు అమెరికాకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah), విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jai Shankar), జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ఈ సమావేశంలో పాల్గొన్నారు. తహవూర్‌ రానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఈ సమావేశంలో వీరు చర్చించారు.

Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫెటర్ల కొనుగోలుకు భారత్ డీల్


గురువారం మధ్యాహ్నానికల్లా..

కాగా, తహవూర్‌ను తీసుకుని ప్రత్యేక విమానం అమెరికాలో బయలుదేరిందని, గురువారం మధ్యాహ్నం కల్లా ఢిల్లీ చేరుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తహవూర్ ఢిల్లీకి చేరుగానే లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుటుందని తెలుస్తోంది. తహవూర్ రాక నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని రెండు జైళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 09 , 2025 | 09:25 PM