Home » Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్ను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. 58 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ బడ్జెట్ ప్రసంగంలో భారతదేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు శాఖలతోపాటు పథకాలకు కేటాయించిన నిధుల వివరాలను ఇప్పుడు చుద్దాం.
ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పారు.
బడ్జెట్ కేటాయింపులతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు.
ఎన్నికల ఏడాది సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో సౌరశక్తిని ప్రోత్సహిస్తామని చెప్పిన ఆమె..
దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతమవుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది సందర్భంగా ఇది పూర్తి బడ్జెట్ కాదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
జీడీపీ అంటే గవర్నెన్స్, డవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెడుతూ, పేదలు, మహిళలు, యువత, అన్నదాతల స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
Memes on Budget 2024: సోషల్ మీడియాలో మీమర్స్ ఏ రేంజ్లో రెచ్చిపోతారో మనందరికీ తెలిసిందే. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. సందర్భం, సమయంతో పని లేకుండా.. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని.. తమదైన శైలిలో ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదిలేస్తుంటారు. ఎలాంటి స్పెషాలిటీ లేకుండానే.. ఎంతో రక్తి కట్టించే మీమర్స్.. ఎంతో కీలకమైన బడ్జెట్ను వదిలిపెడతారా? ఛాన్సే లేదు.