Budget 2024: నిర్మలమ్మ పద్దు ప్రసంగంతో దూకుడుగా స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:29 PM
బడ్జెట్ కేటాయింపులతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు.
ముంబై: మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 76.55 పాయింట్లు లాభపడి 71828.66 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 19.80 పాయింట్లు లాభపడి 21,745.50 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభపడగా.. లార్సన్ అండ్ టూబ్రో, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోతున్నాయి.
మరిన్ని బడ్జెట్ సంబంధిత కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.