Share News

Budget 2024: కీలక రంగాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:30 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ బడ్జెట్‌ ప్రసంగంలో భారతదేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు శాఖలతోపాటు పథకాలకు కేటాయించిన నిధుల వివరాలను ఇప్పుడు చుద్దాం.

Budget 2024: కీలక రంగాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ బడ్జెట్‌ ప్రసంగంలో భారతదేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది మే నాటికి జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరిది. 2024-25 మధ్యంతర బడ్జెట్ భారతీయ జనతా పార్టీకి ఆర్థిక మేనిఫెస్టోగా పరిగణించబడుతోంది. 2024-25లో భారతదేశ మూలధన వ్యయం 11 శాతం పెరిగి రూ.11.11 లక్షల కోట్లకు లేదా జీడీపీలో 3.4 శాతానికి చేరుకుందని నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు.


ఈ క్రమంలో 2024-25 నాటికి బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. వీటిలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు కాగా.. పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని నిర్మల అన్నారు. అయితే వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ పద్దులను ఇక్కడ చుద్దాం.

బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు

-రక్షణ మంత్రిత్వ శాఖ: రూ. 6.1 లక్షల కోట్లు

-రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ: రూ. 2.78 లక్షల కోట్లు

-రైల్వే మంత్రిత్వ శాఖ: రూ. 2.55 లక్షల కోట్లు

-వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ: రూ. 2.13 లక్షల కోట్లు

-హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ: రూ. 2.03 లక్షల కోట్లు

-గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ: రూ. 1.77 లక్షల కోట్లు

-రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ: రూ. 1.68 లక్షల కోట్లు

-కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ: రూ. 1.37 లక్షల కోట్లు

-వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ: రూ. 1.27 లక్షల కోట్లు

వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు

-గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ. 86 వేల కోట్లు

-ఆయుష్మాన్‌ భారత్‌: రూ. 7,500 కోట్లు

-పారిశ్రామిక ప్రోత్సాహకాలకు: రూ. 6,200 కోట్లు

-సెమీ కండక్టర్స్‌, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి: రూ. 6,903 కోట్లు

-సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కి: రూ. 8,500 కోట్లు

-గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కి: రూ. 600 కోట్లు

Updated Date - Feb 01 , 2024 | 01:33 PM