Home » Nominations
Andhrapradesh: పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న జగన్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు.
Andhrapradesh: గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కూటమి నేతలు, కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లింది. నామినేషన్ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.
Andhrapradesh: సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్‌కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ కూటమి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులతో కలిసి మంగళవారం తరలివెళ్లారు. ఆయన ముందుగా సతీమణి కమలమ్మ, కుమారుడు సాయికళ్యాణ్తో కలిసి రొద్దం మండల పరిధిలోని ఆర్ మరువపల్లిలో వెలసిన సీతారాముల దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం రొద్దంలోని పెద్ద ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన వేసేందుకు తరలివెళ్లారు.
బాలీవుడ్ నటుడు, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా అసాంసోల్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్థిగా మంగళవారంనాడు నామినేషన్ వేశారు. రాష్ట్ర ప్రజలు సరికొత్త రికార్డు స్థాయి విజయాన్ని టీఎంసీకి అందించనున్నారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి సమాధానం చెప్పనున్నారని అన్నారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..
Andhrapradesh: ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...
Telangana: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.