AP Elections: పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ నామినేషన్
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:52 AM
Andhrapradesh: పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న జగన్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు.
కడప, ఏప్రిల్ 25: పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Pulivendula YSRCP MLA Candidate YS Jagan) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న జగన్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పులివెందులకు చేరుకున్న సీఎం.. సీఎస్‌ఐ గ్రౌండ్‌లో సభకు హాజరయ్యారు. అక్కడ బహిరంగలో ప్రసంగం అనంతరం ఆర్వో ఆఫీసుకు బయలుదేరిన జగన్.. పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం నామినేషన్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారు.
నేడే చివరి రోజు....
కాగా.. నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఈనెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా.. నేడు నామినేషన్లకు చివరి తేదీ. ఈక్రమంలో నిన్న ఒక్క రోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే పార్లమెంట్ స్థానాలకు 203 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే అసెంబ్లీ స్థానాలకు 1123 మంది అభ్యర్థులు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ పార్లమెంట్ స్థానాలకు 555 మంది అభ్యర్థులు 653 సెట్ల నామినేషన్లు ఇచ్చారు. అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు 3701 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తవనుంది. దీంతో రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అలాగే ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మే 13న పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితలు వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి...
AP Politics: ‘నీకిది తగునా’.. జగన్‌కు వివేకా సతీమణి సంచలన లేఖ..
Hyderabad: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ నేత
Read Latest AP News And Telugu News