AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
ABN , Publish Date - Apr 25 , 2024 | 02:46 PM
Andhrapradesh: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
తిరుపతి, ఏప్రిల్ 25: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ (Nomination) వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్
ఏం జరిగిందంటే..
చంద్రగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని (TDP Candidate Pulivarthi Nani), వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి (YSRCP Candidate Mohithreddy)ఇద్దరూ కూడా ఏకకాలంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అభ్యర్థులతో పాటు భారీగా కార్యకర్తలు ఆర్డీవో ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే వీరిని లోపలికి అనుమతించేందుకు పోలీసుల నిరాకరించారు. అలాగే రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగడమే కాకుండా... టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు. అయితే మరోసారి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు రౌడీ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ప్రతిగా ఆర్డీవో కార్యాలయం వద్దకూ టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో మరోసారి ఇరు వర్గాల రాళ్ల దాడి జరిగింది.
Lok Sabha Polls: తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్ నేతలపై షా ఫైర్!
కాగా... టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని నామినేషన్ వేసి బయటకు వచ్చిన సమయంలోనై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆర్డీవో కార్యాలయంవైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చారు. నిబంధనల ప్రకారం ఆర్డీవో కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించరు. అయితే నిబంధనలు పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అయితే వారిని అక్కడి నుంచి పంపించేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితి. పోలీసుల వైఫల్యమే గొడవక కారణమంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
నేను వస్తున్నప్పుడే ముహూర్తం..: నాని
ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్పందిస్తూ.. ‘‘నేను వస్తున్నప్పుడే వైసీపీ అభ్యర్థి ముహూర్తం పెట్టుకున్నారు.. నామినేషన్‍కు వస్తుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు.. రోడ్డు బ్లాక్ చేసినా నడుచుకుని వచ్చి నామినేషన్ వేయాల్సి వచ్చింది.. ఎంత బెదిరించినా భయపడకుండా కార్యకర్తలు గట్టిగా పనిచేయాలి.. రాళ్లు వైసీపీ వాళ్లు వేస్తే.. పోలీసులు మా వాళ్లను తీసుకెళ్లారు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదు. ఈ 15 రోజులు ఎంత రెచ్చగొట్టినా దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమే.. ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి గుణపాఠం చెబుతారు’’ అని నాని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..
PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..
Read Latest AP News And Telugu News