Home » Notice
పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
పంజాబీ సింగర్ దిల్జిత్ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఈ రోజు దిల్జిత్ కాన్సర్ట్ ఉంది. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన కాన్సర్ట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలా పాటలు పాడారు. హైదరాబాద్‌లో జరిగే కాన్సర్ట్ ఆ విధంగా జరుగుతుందోనని భావించి చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.