Share News

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:58 PM

స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Heralad)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ.661 కోట్ల విలువచేసే స్థిరాస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారంనాడు తెలిపింది.

Rekha Gupta: రోడ్డుపై ఆవుకు రొట్టె విసిరిన వాహనదారుడు.. సీఎం చేతులు జోడించి..


నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణ కర్తగా ఉంది. స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది. ఢిల్లీ, లక్నో ప్రాంగణాలను ఖాళీ చేయాలని ఈ నోటీసులలో కోరింది. ముంబై బిల్డింగ్‌ వరకూ ఒక ఆప్షన్‌గా దాని అద్దెను ఈడీకి ట్రాన్‌ఫర్ చేసే వెసులుబాటు కల్పించింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 8, రూల్ 5(1) కింద ఈడీ ఈ చర్యలు తీసుకుంది. 2023 నవంబర్‌లో ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది.


నేషనల్ హెరాల్డ్ కేసు

ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియా కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియాలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఈడీ విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.


ఇవి కూడా చదవండి..

Mamata Banerjee: వక్ఫ్ చట్టం అమలు చేయం... అల్లర్లకు దిగొద్దు: మమతా బెనర్జీ

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Chhattisgarh Encounter: కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Updated Date - Apr 12 , 2025 | 06:01 PM