Home » NRI
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ప్రవాసులు భారీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికంగా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి పుచ్చా వరుణ్ రాజ్ (Pucha Varun Raj) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు అమెరికా అధికారులు అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు.
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ఎన్నారైకి అరుదైన గౌరవం దక్కింది.
రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కువైత్ ట్రాఫిక్ విభాగం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చట్టాన్ని సవరించి జరిమానాలను భారీగా పెంచింది.
తన తండ్రి మరణానికి ఎయిర్లైన్స్ కారణమని ఓ లేడీ ఎన్నారై (NRI) సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande) తన తండ్రి హరీష్ పంత్( Harish Pant) మరణానికి తాము ప్రయాణించిన ఒక ఎయిర్లైన్స్ కారమణమని అంటున్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి నిహాల్ అంతర్జాతీయ శాంతి బహుమతి రేసులో ముందున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ కిడ్స్ రైట్స్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి తుది పోటీదారులను ప్రకటించింది.
ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఎజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ హిల్ (Candian Parliament Hill) లో ఆదివారం (నవంబర్ 5న) దీపావళి వేడుకలు జరగడం విశేషం.
భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఎన్నారై (NRI) కి అగ్రరాజ్యం అమెరికాలో న్యాయస్థానం జీవిత ఖైదు (Life imprisonment) విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఫ్లోరిడా కోర్టు ఎన్నారై ఫిలిప్ మాథ్యూకు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పించేది గోల్డెన్ వీసా (Golden Visa ). అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది.
నివాసితులు, ప్రవాసులకు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.