Tana: తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి
ABN , Publish Date - Mar 03 , 2024 | 09:55 AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి (sasikanth vallepally), సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు. తానాలో శశికాంత్ వల్లేపల్లి తొలి నుంచి దాతగా పేరు తెచ్చుకున్నారు. తానా ద్వారా చాలా మందికి సాయం చేశారు. పలు ప్రాజెక్టులకు ఫండింగ్ చేస్తున్నారు. అంకితభావం, అందరితో కలిసిపోయే స్వభావం కలిగిన శశికాంత్ వల్లేపల్లి, కాంత్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేలాది మంది విద్యార్థుల చదువు కోసం తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్‌గా సేవలు అందించారు. శశికాంత్ వల్లేపల్లి తానా ఫౌండేషన్ ట్రెజరర్, కార్యదర్శిగా పనిచేశారు.
సేవా కార్యక్రమాలు
తానా ద్వారా సహాయం అందించే వారిలో మరొకరు విద్య గారపాటి. సేవ చేయాలనే సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి సేవలు అందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి 75,000,00 డాలర్లను సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. అమెరికాలో తానా, నాటా, నాట్స్, టిటిఎ లాంటి తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు వచ్చేవారి కోసం మంచినీటి బాటిళ్ళను అందజేస్తుంటారు. ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా మహాసభల్లో 70 వేల వాటర్ బాటిళ్ళను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌తో కలిసి తానా ద్వారా క్యాన్సర్ నిర్దారణ శిబిరాలను నిర్వహించారు. తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్‌గా, న్యూజెర్సీ రీజియన్‌కు రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
తొలి నుంచి తానాలో సభ్యుడిగా
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇతర కమిటీల్లో వినయ్ మద్దినేని పని చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)కి అధ్యక్షుడిగా, బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్‌కి ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. తానాలో కిరణ్ గోగినేని వివిధ పదవులు చేపట్టారు. అట్లాంటాకు చెందిన ఆయన 2019-2021 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలు అందించారు. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా), ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఫౌండేషన్ జాయింట్ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.
మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.