Home » Paris
దాదాపు మూడు వారాల పాటు సాగిన ఉత్కంఠభరితమైన పారిస్ ఒలింపిక్స్(paris olympics 2024) గేమ్స్ నేటి రాత్రితో(ఆగస్ట్ 11న) ముగియనున్నాయి. భారత్‌కు గతసారి కంటే ఒక పతకం తక్కువ వచ్చింది. కానీ భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో యువకుడు నిశాంత్ దేవ్ నుంచి భారత్ బాక్సింగ్‌లో పతకం ఆశించింది. ఆ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడాడు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం స్కోరింగ్ విధానం తప్పుగా ఉందని పలువురు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్ చేతిలో ఓడిపోయింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు బ్రేక్ పడింది. ఆయన పారిస్ వెళ్లేందుకు రాజకీయ అనుమతిని కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంఈఏ సమాచారం పంపింది.
పారిస్ ఒలంపిక్స్(paris olympics 2024)లో బెల్జియం చేతిలో ఓటమి నుంచి బయటపడిన భారత(bharat) హాకీ జట్టు(hockey team) శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత్ బలమైన ప్రదర్శన కనబరిచి 3-2తో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది.
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మను భాకర్. టోక్యో ఒలింపిక్స్‌లో మను (Manu Bhaker) ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుటి కథ మాత్రం పూర్తిగా వ్యతిరేకం. పారిస్ ఒలింపిక్స్‌లో 6 రోజుల్లో భారత్ 3 పతకాలు సాధించింది. అందులో మను భాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఈ క్రమంలోనే భాకర్ కోసం 40 కంటే ఎక్కువ బ్రాండ్లు ప్రకటనల కోసం పోటీ పడుతున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.