Home » Parliament Budget Session
బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం (జులై 22) కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) ప్రభుత్వం దిగిపోయి.. టీడీపీ(TDP) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రోజుకో ఇష్యూ జరుగుతోంది. ఈ ఇష్యూలపై పార్లమెంట్‌లో(Parliament) తమ గళం వినిపించాలని వైసీపీ భావిస్తోంది. అయితే, వైసీపీని లైట్ తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.
Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ను జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో.. ఈసారి బడ్జెట్‌పై యావత్ దేశం ఉత్కంఠగా చూస్తోంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని, బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి తెలిపారు.
Union Budget 2024: జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.