Budget 2024: మోదీ 3.0 తొలి బడ్జెట్ ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:29 PM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని, బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session), బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని, బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి తెలిపారు.
Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..
''భారత ప్రభుత్వం సిఫారసుల మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరిపేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌ను జూలై 23వతేదీన లోక్‌సకు సమర్పిస్తాం'' అని రిజిజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఈసారి బడ్జెట్‌లో పలు చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నారనే అంచనాలు కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
For Latest News and National News click here