Home » Parliament
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్లో లోక్‌సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తాత్సారం చేసింది. బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించి కనీసం నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలోకి తోసేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఫాస్ట్‌గానే ఉంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. మరి కాంగ్రెస్? ఇంకా కొన్ని పెండింగ్‌లోనే పెట్టింది.
గంధపు చెక్కల స్మగ్లర్, బందిపోటు వీరప్పన్ కుమార్తె లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విద్యారాణి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామ్ తమిళర్ కట్చి టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ(BJP) దృష్టి సారించింది. అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల కీలక నేతలతో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొనారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ఓటింగ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నిక వచ్చిన 40శాతం మించి పోలింగ్ జరగడం లేదని చెప్పారు. ఈ సారి ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలని కోరారు.
మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మొదటి విడతలో ఎన్నికలు ( Elections ) జరిగే ప్రాంతాల్లో నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిపాజిట్ కట్టి తమ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ చేయించుకుంటున్నారు.
కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.