Home » Parliament
జిల్లాలో తమ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఏమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ (BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.
ఆదిలాబాద్‌లో లంబాడా బంజారాలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తామని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod ) అన్నారు. మాజీ ఎంపీ నగేష్ బీజేపీలో చేరిక, లోక్ సభ స్థానాన్ని ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై సోమవారం నాడు బీజేపీ (BJP) నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ లక్ష్మణ్‌ని ఆదిలాబాద్ నేతలు కలిశారు.
పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) భారీ ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి నుంచి కొంత తెరుకొని గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా నేడు (సోమవారం) నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) ప్రకటించారు.
నగరంలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
బీఆర్ఎస్(BRS)కు గెలుపు, ఓటములు కొత్త కాదని.. ఈ ఓటమితో కుంగి పోయేది, పొంగి పోయేది ఏమీ లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. ప్రజలంతా ఎమ్మెల్యే ఓడిపోవాలని, కేసీఆర్ మాత్రం గెలవాలని అనుకున్నారని.. అందుకే మనకు మొదటికే మోసం వచ్చిందని చెప్పారు.
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Elections 2024: తెలంగాణలో (Telangana) పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలూ బీఆర్ఎస్ను (BRS) టార్గెట్ చేశాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతుంటే.. ఎంపీలు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మరో నలుగురు సిట్టింగులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం..
బీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ముగ్గురు లోక్‌సభ సభ్యులూ బీజేపీలో చేరనున్నారా..? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకొన్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారూ నడవనున్నారా..