Share News

Delhi: నారీ శక్తి నినాదాలు రాజకీయాల్లో వర్తించవా.. ఎన్నికల బరిలో అతి తక్కువగా మహిళా అభ్యర్థులు

ABN , Publish Date - May 03 , 2024 | 03:19 PM

నారీ శక్తి నినాదాలతో ఊదరగొట్టే నేతలు రాజకీయాల్లో మాత్రం వారి ప్రమేయం లేకుండా ఉండాలని చూస్తున్నాయా.. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఇదే ధోరణి అవలంబించడం మహిళ లోకానికి నచ్చట్లేదు.

Delhi: నారీ శక్తి నినాదాలు రాజకీయాల్లో వర్తించవా.. ఎన్నికల బరిలో అతి తక్కువగా మహిళా అభ్యర్థులు

ఢిల్లీ: నారీ శక్తి నినాదాలతో ఊదరగొట్టే నేతలు రాజకీయాల్లో మాత్రం వారి ప్రమేయం లేకుండా ఉండాలని చూస్తున్నాయా.. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఇదే ధోరణి అవలంబించడం మహిళ లోకానికి నచ్చట్లేదు.

దేశ వ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections 2024) ఏడు దశల్లో జరుగుతున్నాయి. 543 లోక్ సభ నియోజకవర్గాలకుగానూ అధికార బీజేపీ 434 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించగా.. కాంగ్రెస్ 317 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపింది. అయితే రెండు ప్రధాన జాతీయ పార్టీలు అతి తక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థులను బరిలో దింపాయి.


ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల్లో కాషాయ పార్టీలో మహిళా అభ్యర్థుల వాటా 16 శాతం కాగా, కాంగ్రెస్‌ 14 శాతం మహిళలను లోక్ సభ అభ్యర్థులుగా నిలిపింది. అంటే బీజేపీలో ప్రతి 7 మందిలో ఒక్కరు, కాంగ్రెస్‌లో ప్రతి 6 మంది అభ్యర్థుల్లో ఒక్క మహిళ అభ్యర్థి పోటీలో నిలిచారన్నమాట.

2004, 2019 మధ్యకాలంలో 1,934 మంది పురుష ఎంపీలు, 248 మంది మహిళా ఎంపీలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దేశంలోని మొత్తం 543 సీట్లలోని 349 స్థానాల్లో గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ మహిళా అభ్యర్థులు ఎన్నిక కాలేదు. గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 99 మంది మహిళా ఎంపీలను పార్లమెంటుకు పంపగా, కాంగ్రెస్‌ 46, టీఎంసీ 25, బీజేడీ 8, సీపీఎం 7, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 6, శివసేన 6, ఎన్‌సీపీ 6, డీఎంకే 6, బీఎస్పీ 6, ఏఐఏడీఎంకే 4, జేడీయూ 3, స్వతంత్రులు 3, బీఆర్‌ఎస్‌ 3, ఎల్‌జేపీ 2, పీడీపీ 2, ఆర్‌ఎల్‌డీ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున మహిళ ప్రజాప్రతినిధులు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 03:19 PM