Home » Pinnelli Ramakrishna Reddy
హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) బెయిల్ మంజూరు చేయడంపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు(AP High Court). రెండు హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎన్నికల రోజు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పాల్పడిన అకృత్యాల గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు నోముల మాణిక్యరావును పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా వేధింపులకు పాల్పడ్డారు.
దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్‌తో తన ఆవేదనను పంచుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాల రావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై శనివారం మరో కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.