Home » Pinnelli Ramakrishna Reddy
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి పారిపోవడానికి పోలీసులే సహకరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్ మీనాను కలిసి పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్‌సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు.
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం గురువారం ‘చలో మాచర్ల’కు పిలుపిచ్చింది.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులను పోలింగ్ నాడు ప్రతిఘటించిన టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఉదంతం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.
ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.