Share News

Andhra Pradesh: మాచర్లలో హైఅలర్ట్‌

ABN , Publish Date - May 24 , 2024 | 04:19 AM

పోలింగ్‌ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం గురువారం ‘చలో మాచర్ల’కు పిలుపిచ్చింది.

Andhra Pradesh: మాచర్లలో హైఅలర్ట్‌

మాచర్ల టౌన్‌, మే 23: పోలింగ్‌ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం గురువారం ‘చలో మాచర్ల’కు పిలుపిచ్చింది. అలాగే వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో మాచర్ల పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం కూడా 144 సెక్షన్‌ కొనసాగించారు. ఉదయం 10 గంటలకే పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య, ట్రైనీ డీఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో కవాతు కూడా నిర్వహించారు.

ప్రజలంతా పోలీసులకు సహకరించాలని,గుంపులుగా ఉండవద్దని మైక్‌లో ప్రకటిస్తూ దుకాణాలను మూసివేయించారు. ఇంకోవైపు.. ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ స్పష్టం చేశారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద బలగాలను మోహరించారు. పోలింగ్‌ మరుసటి రోజు నుంచే మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు.

Updated Date - May 24 , 2024 | 04:19 AM