AP Election 2024: మాచర్ల ఘటనపై సంచలన నిజాలు బయటపెట్టిన జూలకంటి
ABN , Publish Date - May 23 , 2024 | 06:18 PM
ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
పల్నాడు: ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
అయితే ఛలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ వారిని అడ్డుకున్నారు. అయితే బ్రహ్మరెడ్డి ఈ విషయంపై మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ఛలో మాచర్లకు రానీవ్వకుండా టీడీపీ నేతలను గృహనిర్బధం చేయటం బాధకరమైన విషయమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ మూకల వల్ల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించటం తమ పార్టీ ప్రధాన బాధ్యత అని తెలిపారు. గత 10 రోజులుగా తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారడ్డి మాత్రం హైదరాబాద్‌లోయ దర్జాగా తిరుగుతున్నారన్నారు. తన సొంత గ్రామానికి కూడా పంపించకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకొని బాధితులకు కొంత ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు, మూడు రోజులు ఆగండి అంటూ ఎన్నికల కమిషన్, పోలీసులు తమను పంపిచకుండా ఆపుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని దారుణాలు జరిగాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొత్త పుల్లారెడ్డి గ్రామంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దారుణాలు అన్ని బయటకు వచ్చాయన్నారు.
మరెన్నో నిజాలు కూడా బయటకు రాబోతున్నాయని చెప్పారు. ఇప్పుడు తాత్కాలికంగా తమ యాత్రను ఆపినా .. త్వరలోనే బాధితులను కలిసి పరామర్శిస్తామని తెలిపారు. తాము యుద్ధానికి వెళ్లట్లేదని.. వైసీపీ నేతల్లాగా పరామర్శల పేరుతో రాళ్లు, కత్తులు తీసుకొని వెళ్లట్లేదని చెప్పారు. పోలీసు శాఖ వారు తమను అర్ధం చేసుకోవాలని అన్నారు. అవసరమైతే తమ వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు.
తమకేమీ అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. పరామర్శల పేరుతో కత్తులు, రాళ్లు, బాంబులతో వెళ్లిన వారిని ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. తాము బాధితుల కన్నీళ్లు, కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే తమను ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. తాము బాధితులను పరామర్శిద్దామనుకుంటే శాంతి భద్రతల సమస్యలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్పాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. పిన్నెల్లి టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారని ధ్వజమెత్తారు. పిన్నెల్లిపై ఏ సెక్షన్ కింద కఠిన చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. తమపై కూడా పోలీసులు ఎందుకు కేసులు పెట్టారని ప్రశ్నించారు. పోలీసులు కొందరికీ వత్తాసు పలకడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పిన్నెల్లి, అతని బ్రదర్ వల్ల గాయపడ్డ 74 మంది జాబితాను కూడా పోలీసులకు ఇస్తామని అన్నారు. ఇప్పటికైనా పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూలకంటి బ్రహ్మరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..
నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..
టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News