Home » PK Strategist
ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్ అభియాన్' రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా 'జన్ సురాజ్' అవతరించనుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఆశించని విధంగా ఫలితాలు రాకపోతే వెనక్కి తగ్గే విషయాన్ని రాహుల్ గాంధీ పరిశీలించాలని సూచించారు.
2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిశోర్ స్వయంగా వెల్లడించారు. 2017లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారని, ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ‘‘ అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయాక వైఎస్సార్సీపీలోని నేతలు, పార్టీ సానుభూతిపరులు చాలామంది పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు’’ అని పీకే బయటపెట్టారు.
Prasant Kishore BRS Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటూ తేలని పరిస్థితి. బీఆర్ఎస్కు (BRS) ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు (Congress) ఒక్క అవకాశం ఇస్తారా..? అన్నది తెలియట్లేదు...
పీకే... జనాల సెంటిమెంట్ తో ఓట్లు రాల్చటంలో దిట్ట. సెంటిమెంట్ ను వాడుకోవటంలో ఆరితేరిన తెలుగు రాష్ట్రాల సీఎంలకు పీకే తోడైతే ఎలా ఉంటుంది..? ఇటు తెలంగాణ, అటు ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో...