PK Strategy: పీకే రగిలిస్తున్న సెంటి'మంటలు'.. తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్..
ABN , First Publish Date - 2023-01-05T19:04:56+05:30 IST
పీకే... జనాల సెంటిమెంట్ తో ఓట్లు రాల్చటంలో దిట్ట. సెంటిమెంట్ ను వాడుకోవటంలో ఆరితేరిన తెలుగు రాష్ట్రాల సీఎంలకు పీకే తోడైతే ఎలా ఉంటుంది..? ఇటు తెలంగాణ, అటు ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో...
పీకే (PK Strategist)... జనాల సెంటిమెంట్ తో ఓట్లు రాల్చటంలో దిట్ట. సెంటిమెంట్ ను వాడుకోవటంలో ఆరితేరిన తెలుగు రాష్ట్రాల సీఎంలకు (Telugu States CMs) పీకే (Prashant Kishor) తోడైతే ఎలా ఉంటుంది..? ఇటు తెలంగాణ (Telangana), అటు ఏపీలో (AP) ప్రస్తుత రాజకీయాల్లో చెలరేగుతున్న సెంటిమంటల వెనుక పీకే మాస్టర్ మైండ్ (PK Master Mind) ఉన్నట్లు కనపడుతోంది. రాష్ట్రాలుగా విడిపోయి రెండుసార్లు ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా ఇంకా సెంటిమెంట్ తోనే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇటు కేసీఆర్ (KCR), అటు జగన్‌లు (Jagan) ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) అని ప్రకటించగానే తెలంగాణ వాదుల నుండి వ్యతిరేకత మొదలైపోయింది. ఇది తెలంగాణ పార్టీ కాదని విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అసలే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ టాక్ బలంగా ప్రజల్లోకి వెళ్తే నష్టమని తేలటంతో... స్ట్రాటజిస్ట్ పీకే ఎంటరైపోయారు. ఇంకేముంది బీఆర్ఎస్ నుండి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేయటం, కేసీఆర్ ఉద్యమాన్ని నడిపారని... ఆయన నాయకత్వంలోనే చావటమో చంపటమో అన్నట్లుగా పోరాటం చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేసీఆర్ కు సైన్యం ఉందని, చంపేందుకైనా చచ్చేందుకు అయినా రెడీ అని కామెంట్ చేశారు.
గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు కూడా తెర వెనుక ఉన్నది పీకేనే. పైగా కేసీఆర్, జగన్‌లు రహస్య మిత్రులుగా చలామణి అవుతున్న దశలో రెండు పార్టీల తరఫున పీకే సెంటిమెంట్ ను మండించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఏపీలో తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ కు, తెలంగాణ వాదానికి టాటా చెప్పిన కేసీఆర్ కు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన స్కెచ్ ను పక్కాగా ఫాలో అవుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.