Share News

TS Assembly Polls : భేటీ తర్వాత ‘పీకే’ రిపోర్టుతో కేసీఆర్ కంగుతిన్నారా.. ఇంతకీ అందులో ఏముంది..!?

ABN , First Publish Date - 2023-11-23T23:25:35+05:30 IST

Prasant Kishore BRS Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటూ తేలని పరిస్థితి. బీఆర్ఎస్‌కు (BRS) ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు (Congress) ఒక్క అవకాశం ఇస్తారా..? అన్నది తెలియట్లేదు...

TS Assembly Polls : భేటీ తర్వాత ‘పీకే’ రిపోర్టుతో కేసీఆర్ కంగుతిన్నారా.. ఇంతకీ అందులో ఏముంది..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటూ తేలని పరిస్థితి. బీఆర్ఎస్‌కు (BRS) ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు (Congress) ఒక్క అవకాశం ఇస్తారా..? అన్నది తెలియట్లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ (CM KCR) ఇంటెలిజెన్స్ సర్వే (Intelligence Survey) చేయించడం.. షాకింగ్ ఫలితాలతో చేసేదేమీ లేక ఒకప్పుడు వద్దనుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను (Prashant Kishor) రంగంలోకి దింపారన్నది గత మూడ్రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తున్న మాట. కేసీఆర్ పిలుపు మేరకు ప్రగతి భవన్‌కు పీకే వచ్చారని మూడో కంటికి రాకుండా మూడు గంటల పాటు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందట. అయితే.. ఏం చేసైనా సరే ‘కారు గెలవాలె.. సారు కుర్చీలో కూర్చోవాలె’ ఈ మాటే కేసీఆర్ పదే పదే పీకేతో చెప్పారట. అసలే సమయం తక్కువగా ఉంది చేయడానికేముందని పీకే చెప్పినప్పటికీ ‘గెలవాలి అంతే.. ఏం చేస్తవో చేయ్’ అని గులాబీ బాస్ మీటింగ్ ముగించారట. ఫైనల్‌గా రెండ్రోజులు సమయం అడిగిన ప్రశాంత్ కిశోర్.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితి ఎలా ఉంది..? చేయాల్సిన మార్పులు ఏంటి..? అసలు ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలా ఉన్నారన్నది చాలా లోతుగా సర్వే చేయించారట. ఆ సర్వే తాలుకూ రిపోర్టు కేసీఆర్‌కు ఇచ్చారట. ఓపెన్ చేసి చూసి కేసీఆర్ అవాక్కయ్యారట.


KCR-And-PK.jpg

రిపోర్టులో ఏముంది..?

తెలంగాణ జరుగుతున్న టాక్ ప్రకారం.. 40 సీట్లకు మించి బీఆర్ఎస్ గెలవలేదని పీకే తేల్చేశారట. ఎందుకీ పరిస్థితి అనేది కూడా నిశితంగా రిపోర్టులో వివరించారట. ‘కేసీఆర్ కుటుంబంపైనా, పాలనా వ్యవహారంపైనా ప్రజలు తీవ్ర అసంతృప్తి.. అంతకుమించి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికిప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాదు.. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు’ అని రిపోర్టులో క్లియర్‌కట్‌గా రాసి కేసీఆర్, కేటీఆర్‌లకు (KTR) చెప్పేసి ప్రశాంత్ కిశోర్ చేతులెత్తేశారట. ఈ రిపోర్టు ఇచ్చిన తర్వాత కనీసం గౌరవప్రదమైన సీట్లు అయినా వచ్చేలా వ్యూహరచన చేయాలని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. పరిస్థితి చేయి దాటిపోయాక నష్టనివారణ చర్చలు ఎన్ని తీసుకున్నా ఫలితం లేదని చెప్పేశారట. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆఖరి నిమిషంలో చేయాల్సిన పనులు మాత్రం సూచించారట. ఎన్నిచేసినప్పటికీ ఆశించిన ఫలితాలు అయితే రావని చెప్పారట. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కూడా పీకే (PK) తేల్చారని తెలుస్తోంది.

PK.jpg

తప్పు చేశారు సార్..!!

ఈ సందర్భంగా ఐప్యాక్‌తో (I PAC) గతంలో బీఆర్ఎస్ కుదుర్చుకున్న ఒప్పందం గురించి కూడా ప్రస్తావన వచ్చిందట. అనుకున్నట్లుగానే అప్పట్నుంచే తమ టీమ్ ఉండి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని.. తప్పు చేశారు సార్ అని కేసీఆర్‌తో పీకే అన్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ మాటతో గులాబీ బాస్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఇది ఇప్పుడు అటు సోషల్ మీడియాలో.. బీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తున్న చర్చట. ఇందులో నిజానిజాలెంత అనేది మాత్రం గులాబీ పార్టీ నేతలకే తెలియాలి. పైగా ప్రగతి భవన్‌‌లో (Pragati Bhavan) పీకే-కేసీఆర్ మధ్య జరిగిన భేటీ గురించి కానీ.. సర్వే రిపోర్టు గురించి కానీ ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఏదో జరిగిపోతోందనే భావన తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద అడ్వాంటేజ్‌గానే మారింది. దీంతో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇదిగో డిసెంబర్-09న ఉదయం 10:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతోందంటూ అగ్రనేతలు మరోసారి బల్లగుద్ది చెబుతున్నారు. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.. డిసెంబర్-03న ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకే ఎరుక. చూడాలి మరి..!

congress.jpg

మరిన్ని తెలంగాణ ఎన్నికల కథనాల కోసం క్లిక్ చేయండి

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?


Updated Date - 2023-11-23T23:34:22+05:30 IST