Home » Police case
కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు.
మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే దళారి మోసం చేశారంటూ బాధితుడు శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.10లక్షలు వసూలు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా పోలీసులంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతారు. ఎలాంటి తప్పు, నేరం చేయకపోయినా పోలీసులతో మాట్లాడాలంటేనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రజల్లో ఉండే ఈ బలహీనతను సైబర్ నేరగాళ్లు ఇటీవల డబ్బు చేసుకుంటున్నారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్(Manorama Khedkar)ను పుణె పోలీసులు(pune police) రాయ్‌గఢ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఖేద్కర్ తల్లి పిస్టల్‌తో రైతులను బెదిరించిన వీడియో ఇటివల వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
వివాదస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. భూ వివాదంలో కొందరిని ఆయుధాలతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమా ఖేద్కర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.