Home » Ponnam Prabhakar
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు.
బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
ప్రతి జిల్లా కేంద్రంతో పాటు 100 పడకలు ఉన్న హాస్పిటల్‌కు ఒక బ్లడ్‌బ్యాంక్ ఉండేలా కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతోపాటు పలురాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్‌గౌడ్ కుటుంబసభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నిమ్స్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ సాయిసతీశ్(Professor Saisathish), జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కోరారు. నేడు (బుధవారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.
అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.