Ponnam Prabhakar: కేబుల్ బ్రిడ్జి ఎవరి కోసం వచ్చిందో తెలుసు
ABN , Publish Date - Jun 18 , 2024 | 04:21 PM
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు.
కరీంనగర్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని గుర్తుచేశారు. జంక్షన్ల పేరుతో అంచనాలు పెంచారని వివరించారు. గతంలో జరిగిన తప్పుల గురించి ఆరా తీస్తున్నామని వెల్లడించారు. విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి హెచ్చరించారు. తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో మరొకరు తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని వివరించారు. కరీంనగర్ అభివృద్ధి తమకు ముఖ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డెవపల్ మెంట్ విషయంలో రాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు.