Home » Praja Galam
కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్‌లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్‌లో బాబు బస చేస్తారు.
విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తారని.. అటువంటి వ్యక్తిపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ విమర్శలు చేయడం బాధకరమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటంటూ సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ఏ మాత్రం సిగ్గున్నా పవన్ కల్యాణ్‌తో సంసారం చేయగలడా? అని సూటిగా నిలదీశారు.
కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరులో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్‌లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు రాజాంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్‌పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.
రాజధాని అంటే నాలుగు బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అవైతే ఎప్పుడో కట్టేశానని.. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టానని గుర్తుచేశారు. కానీ వాటితో రాజధాని కాదన్నారు. ‘రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ సభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముందు దూసుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాగళం సభలు నిర్వహిస్తూ వైసీపీ సర్కార్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు.