Share News

AP Elections: చంద్రబాబు ‘ప్రజాగళం’ సభల షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:28 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ సభలు, రోడ్‌ షోలో నిర్వహిస్తూ ముందు దూసుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాగళం సభలు నిర్వహిస్తూ వైసీపీ సర్కార్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

AP Elections: చంద్రబాబు ‘ప్రజాగళం’ సభల షెడ్యూల్ ఇదే..
TDP Chief Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections) మరికొద్దిరోజులే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ సభలు, రోడ్‌ షోలో నిర్వహిస్తూ ముందు దూసుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాగళం సభలు (Prajagalam Sabha) నిర్వహిస్తూ వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..


అలాగే రేపటి (శనివారం) నుంచి పలు నియోజకవర్గాల్లో జరిగే ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కూడా పలు సభల్లో పాల్గొనున్నారు. 16, 17 తేదీల్లో జరిగే సభలు, రోడ్‌షోలలో ఇరువురు నేతలు పాల్గొంటారు. నేటితో కలిపి ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి అయ్యాయి. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ప్రజాగళం సభలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రజాగళం షెడ్యూల్‌‌ను టీడీపీ విడుదల చేసింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూసేయండి..


షెడ్యూల్ ఇదే..

  • రేపు (శనివారం) తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం.

  • 14న పాయకరావుపేట, చోడవరం, గాజువాక

  • 15న రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం

  • 16, 17వ తేదీల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభలు.

  • 16వ తేదీన విజయనగరరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి, సభలో ఇరువురు నేతలు పాల్గొననున్నారు.

  • 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు.


ఇవి కూడా చదవండి...

AP elections: విశాఖ సౌత్‌లో నెగ్గేదెవరు..?

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 12:35 PM