Home » Praneeth Rao
ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం,
సాయంత్రం భుజంగ రావు, తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరు పరుచనున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబీ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి సారి రిటైర్డ్ ఐజి పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లును పోలీస్ అధికారులు విచారించారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ ఆదేశాలతో పనిచేశానని గట్టు మల్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో రాధా కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Phone Tapping Case: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు.
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది. ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైందని, నిర్లక్ష్యం వహించొద్దని కోరారు.
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితును కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నిందితులు తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. రేపటి (బుధవారం) లోగా పిటిషన్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో కేసును రేపటికి వాయిదా వేసింది.
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే...
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ట్యాప్ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.