Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం..మునుగోడు ఉపఎన్నికల్లోనూ..
ABN , Publish Date - Apr 05 , 2024 | 09:27 AM
తీగ లాగితే డొంకే కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నల్లగొండకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు వారిపై అభియోగాలొచ్చాయి.
హైదరాబాద్: తీగ లాగితే డొంకే కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నల్లగొండకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు వారిపై అభియోగాలొచ్చాయి. జిల్లాలో ప్రస్తుత ఓ ఎమ్మెల్యే ( అప్పట్లో మాజీ ఎమ్మెల్యే ) సంభాషణను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ రోడ్డులో ఫోన్ ట్యాప్ చేసి వినడానికి ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయి. వారిపై కూడా అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక లిఫ్ట్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ తీసుకువచ్చినట్లు సమాచారం.
KCR: నేడు కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్
ఎస్‌ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా.. తాజాగా మొయినాబాద్ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో.. మరికొందరు పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2022 నవంబరులో మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌తో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే..! అయితే.. ఈ నలుగురి ఫోన్లను ఎస్‌ఐబీ డీఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే.. అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాంతో.. పక్కాగా స్కెచ్‌వేసి, ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ప్రధాన నిందితుడు నందకుమార్, సింహయాజి, రామచంద్ర భారతిలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
TS News: కొమురం భీం జిల్లాలోని పలు గ్రామాలకు హై అలర్ట్..