Share News

Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యుడు, చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్

ABN , Publish Date - Mar 26 , 2024 | 05:33 PM

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది. ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైందని, నిర్లక్ష్యం వహించొద్దని కోరారు.

Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యుడు, చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది. ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) మంగళవారం నాడు (ఈ రోజు) స్పందించారు. ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశం తీవ్రమైందని, నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు బయట పడుతున్నాయని ఆయన వివరించారు.

అప్పటి సీఎం బాధ్యుడు

ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్టుగా కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఆస్తులు కూడబెట్టి

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు (Praneeth Rao), భుజంగ రావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో ఈ రోజు పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులుగా ఉన్న అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. దీంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించారని సమాచారం. ప్రణీత్‌తో కలిసి ఆధారాలు ధ్వంసం చేశారని అంగీకరించారని తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరికి పంపించారు. విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పేర్లను భుజంగ రావు, తిరుపతన్న ప్రస్తావించారు. వారి కోసం ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Phone Tapping case: ప్రణీత్ రావుని కస్టడీకి ఇవ్వండి.. నాంపల్లి కోర్టులో పిటిషన్

Updated Date - Mar 26 , 2024 | 05:33 PM