Home » Pressmeet
న్యూఢిల్లీ: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో గందరగోళం నెలకొందని, ఇప్పుడు అంతా సర్ధుకుందని.. పరిస్థితి చక్కబడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని సీఎం తెలిపారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
అమరావతి: టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు.
కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
అమరావతి: ఏపీ గనులు - భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మూడో బ్లాక్‌లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
అమరావతి: హౌసింగ్ కార్యక్రమంపై నిన్న (మంగళవారం) సమీక్షించానని, గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థ సారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారని ఆరోపించారు.
అమరావతి: హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణకు ముందు వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన హోంమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.