CPI: ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలి: కె రామకృష్ణ
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:42 PM
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (CPI State Secretary) కె రామకృష్ణ (Ramakrishna) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)పై కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య అలానే ఉందని, బ్లాక్ మనీ వెలికి తీస్తామన్నారు.. అదీ చేయలేకపోయారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, సీఎం చంద్రబాబు చెప్పేదానికి, జగన్ చెప్పేదానికి ఏమాత్రం పొంతన లేదని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర అప్పులపై స్పష్టత లేని ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేదని, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మీడియా సమావేశం పెట్టి వివరించాలని డిమాండ్ చేశారు.
మదనపల్లెలో భూములు కబ్జా, పత్రాల దగ్ధం చేశారని, కడప జిల్లాలో కూడా లక్ష ఎకరాలపై చిలుకు భూములు కబ్జాకు గురయ్యాయని, దానిపై కూడా విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన భూములపై విచారణ జరిపించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ దగ్గర ఉన్న భూముల సమాచారం అందజేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన భూములపై విచారణ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాగా నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లా, సీఆర్ భవన్‌లో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలు లేవన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు, అప్పులపైనే గవర్నర్ ప్రసంగం సాగిందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, పూర్తిస్థాయి బడ్జెట్ ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని ఆదుకుని ఆర్థికంగా గాడిలో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముచ్చుమర్రిలో బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేయడం దారుణమన్నారు. నేటికి బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోవడం బాధాకరమని అన్నారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు వేసి పంటలు ఎండిపోయాయని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ధరలు తగ్గించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రామకృష్ణ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విచారణకు సహకరించని మోహిత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన..
భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News