Share News

GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్

ABN , Publish Date - Jul 30 , 2024 | 01:19 PM

విశాఖ: బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు.

GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్

విశాఖ: బీజేపీ సీనియర్‌ నేత (BJP Leader), మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు (Former MP GVL Narasimha Rao) హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ (Congress) ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్ట పోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారాయన. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్ట పరమైన చర్యలు వుంటాయని, ఎవరి దగ్గరైనా 4 రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. లేదంటే తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.


ప్రధానిని కీలు బొమ్మను చేసి జనపథ్ నిర్ణయాలు అమలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని జీవీఎల్ అన్నారు. ఏపీకి ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు.10 శాతం సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా రాదని వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు. ప్రజల పక్షాన పోరాడాలని అనుకుంటే.. ప్రతిపక్ష హోదా అవసరం లేదని.. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చునని అన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయని, 3,100 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందని అన్నారాయన.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం నిధులు ఇస్తే జగన్‌ ఏం చేశారు?..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 30 , 2024 | 01:19 PM