Home » Pressmeet
ప.గో. జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు.
కరీంనగర్: విపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ గాళ్ళు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు మీకు మాత్రమే దేవుడా?.. రాముని పేరు లేకుండా ఓట్లు అడగలేరా అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.
కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు.
విజయవాడ: టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బీసీ డిక్లరేషన్ వడ్డెర కోసం ‘ వడ్డెర్లకు అండ.. తెలుగుదేశం జెండా’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
విజయవాడ: సీఎం జగన్ కోడి కత్తి కేసు ఏ విధంగా అంకురార్పణ చేశారో అదేవిధంగా గులక రాయి దాడి డ్రామా చేశారని, బీసీ వర్గానికి చెందిన పదిమంది యువకుల్ని గులకరాయు కేసులో బలి చేశారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పట్టాభిరామ్ అన్నారు.
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ఏపీలో ఎన్నికల సమయం వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని, 2019లో కోడికత్తి , ఇప్పుడు గులకరాయి ... రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు.