Share News

KTR.. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు: కేటీఆర్

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:57 PM

ముఖ్యమంత్రి చెప్పిన రూ. లక్షన్నర కోట్ల మాట తాను అంటే తనపై ప్రభుత్వం కేసు పెట్టిందని, వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు, గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారని కేటీఆర్ ఆరోపించారు. మూసి ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

KTR.. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిటీ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి నాచారం ఎస్టీపీని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపటం వస్తలేదని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులే కొడుతున్నారని, ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి మూసికి రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, మూసి సుందరీకరణ కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు మూసికి తీసుకువస్తే పూర్తి అవుతుందన్నారు. కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు చెప్పి అవినీతి కోసం కుట్ర చేస్తుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి చెప్పిన లక్షన్నర కోట్ల మాట తాను అంటే తనపై ప్రభుత్వం కేసు పెట్టిందని, వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు, గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారని కేటీఆర్ ఆరోపించారు. మూసి ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. తమ పార్టీ మూసికి వ్యతిరేకం కాదని.. కానీ మూసి ప్రాజెక్టు పేరు చెప్పి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోమని అన్నారు. హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ పూర్తి అయి అనుమతులు ఉండి పన్నులు కడుతున్న వారి ఇళ్లను కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసేవరకు.. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేదాక పేద ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.


మీ ఇంటిపైకి బుల్ డోజర్లు వస్తే తనతో సహా పార్టీ నాయకులందరూ ముందుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేరన్న కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసుకున్నామన్నారు. 24 గంటల విద్యుత్తు నిరంతరంగా సరఫరా చేయడంతో పాటు తాగునీటి కోసం కష్టాలు లేకుండా చేశామని, హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేల అన్ని రంగాల్లో అభివృద్ధిని చేపట్టామని చెప్పారు. హైదరాబాద్ నగర మూరికినీటి శుద్ధికరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

మూసీ నదిలో మూరికినీరు రాకుండా ఎస్‌టిపిల నిర్మాణం చేపట్టామని, 3,866 కోట్ల రూపాయలతో ఎస్‌టిపి నిర్మాణం మనం చేపడితే మొన్న ముఖ్యమంత్రి వచ్చి ఉప్పల్లో ప్లాంట్ ప్రారంభించారన్నారు. మూసి పునరజీవనం అని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది... కానీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేసిఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసిందన్నారు. దీంతోపాటు కొండపోచమ్మ సాగర్ నుంచి నగర జంట జలాశయాలకు నీరు తీసుకువచ్చి మూసిలో స్వచ్ఛమైన తాగునీరు పోసేందుకు గత ప్రభుత్వమే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందన్నారు. మూసిపైన ఇప్పటికే బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా గత ప్రభుత్వమే పూర్తి చేసిందని, ఉప్పల్ నాచారం వంటి చోట్ల మూసి సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశామని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎంబిబిఎస్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బిఎల్‌ఆర్ విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ చెక్కులను పంపిణీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..

కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ..

టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం

స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్

7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 27 , 2024 | 12:57 PM