Minister Ponnam: నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి..
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:52 AM
కుల గణన కోసం 150 ఇళ్లకు ఒక నోడల్ అధికారిని నియమించామని... ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. ఒక డిఏ వేయాలని నిర్ణయించామని, 2022 నుంచి డిఏ పెండింగ్‌లో ఉందని, దీనిపై రాజకీయం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: కుల గణన (Caste ఆnumeration) నవంబర్ (November0 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 4వ తేదీ నుంచి అధికారులు, సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 150 ఇళ్లకు ఒక నోడల్ అధికారిని నియమించామని... ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. ఒక డిఏ వేయాలని నిర్ణయించామని, 2022 నుంచి డిఏ పెండింగ్‌లో ఉందని, దీనిపై రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
కాగా తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే రోల్ మోడల్‌గా నిలవబోతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కలను నెరవేర్చబోతున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెడుతున్నామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన భట్టి ఆయనతో సమావేశమయ్యారు. కుల గణన సర్వే ఫార్మాట్ అందజేశారు. గంటకు పైగా జరిగిన చర్చలో రాష్ట్రంలో కుల గణన, ప్రణాళిక, విధివిధానాలు తదితర అంశాలపై చర్చించారు.
జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇంఛార్జిగా భట్టి విక్రమార్కను అధిష్ఠానం నియమించిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్, భట్టి మధ్య జార్ఖండ్ ఎన్నికలపైనా చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌గౌడ్ బాధ్యతల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, పీసీసీ, డీసీసీ కమిటీలు, హైడ్రాపై చర్చ జరిగినట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా ఇరువురు చర్చించినట్టు సమాచారం. అనంతరం ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్‌తోనూ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆయనతోనూ రాష్ట్రంలో కుల గణన, జార్ఖండ్ ఎన్నికల అంశాలపైనే చర్చించినట్టు తెలిసింది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజుతో భట్టి భేటీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్థికి చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు మద్దిరాలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలు రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని, వాటిని రీ షెడ్యూల్ చేస్తే రాష్ట్రానికి ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు మద్దిరాలను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాత అప్పులు, వడ్డీల భారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్
7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ
ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News