Home » Punjab
పంజాబ్‌లోని ఫరీద్కోట్ లోక్‌సభ స్థానం నుంచి సరబ్జిత్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. అతడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు.
లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.
శస్త్రచికిత్స చేయించుకునేందుకు భయపడుతున్న ఓ చిన్నారి దృష్టి మరల్చేందుకు ఓ డాక్టర్ పాటించిన చిన్న ట్రిక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఆన్లైన్లో ఆర్డరిచ్చిన కేక్ తిన్న ఓ పదేళ్ల చిన్నారి దుర్మరణం చెందిన ఘటన పంజాబ్‌లో తాజాగా వెలుగు చూసింది
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ దంపతుల ఇంట మహాలక్ష్మి జన్మించింది. వారికి గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సీఎం మాన్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నాడు.
లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్ ( Punjab ) లోని సంగ్రూర్‌లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు మంగళవారంనాడు అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
దివంగత పంజాబీ సింగర్, ర్యాపర్ సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) ఫ్యామిలీ(family) మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆయన తల్లి చరణ్ కౌర్(58) ఆదివారం తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ఒకసారి తనను కలిశారని వివరించారు. తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారని సిద్దూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని, తన డిప్యూటీగా పనిచేస్తానని చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు.