Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల
ABN , Publish Date - May 02 , 2024 | 02:46 PM
వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
ఢిల్లీ: వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు(Vande Bharat Metro) కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
ప్రారంభ దశలో 50 రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వాటిని క్రమంగా 400కి పెంచుతారు. వందే భారత్ మెట్రో 100-250 కిమీల మధ్య ప్రయాణించగలదు. ఈ మెట్రోలు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి. రైలులో 12 కోచ్‌లు ఉంటాయి. వాటిని 16 కోచ్‌ల వరకు విస్తరించవచ్చు.
రైల్వే శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో.. రైళ్లలో భద్రతను పెంచడానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నాయకత్వంలో 2014 నుండి అనేక సంస్కరణ చేపట్టామని చెప్పింది.
భద్రతకు సంబంధించిన పనుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, ట్రాక్ పునరుద్ధరణ, మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు, సురక్షితమైన ప్యాసింజర్ కోచ్‌ల ట్రాక్‌ను వేగవంతంగా ఆధునీకరించడం వంటి ఎన్నో పనులు చేసినట్లు పేర్కొంది.
Read Latest National News And Telugu News