Business Idea: బిజినెస్ ఐడియా అదుర్స్.. ఇంటికే వచ్చి పెంపుడు జంతువులను..
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:34 PM
ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో పలువురు పెంపుడు జంతువులను(pets) పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. కానీ కొంత మంది యజమానులు(owners) మాత్రం వాటిని సరైన రీతిలో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పెంపుడు జంతువులకు దుమ్ము పట్టి వెంట్రుకలు పెరిగి చిందర వందరగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లూథియానా(Ludhiana)లో ఓ వ్యక్తి పెంపుడు జంతువులను తీర్చిదిద్దడం కోసం వినూత్నంగా ఆలోచించి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో పలువురు పెంపుడు జంతువులను(pets) పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. కానీ కొంత మంది యజమానులు(owners) మాత్రం వాటిని సరైన రీతిలో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పెంపుడు జంతువులకు దుమ్ము పట్టి వెంట్రుకలు పెరిగి చిందర వందరగా తయారవుతున్నాయి. ప్రస్తుత బీజీ లైఫ్‌లో అనేక మంది వాటి కోసం సమయం కేటాయించడం లేదు. అయితే కొంత మంది మాత్రం వాటికి సమయానికి హెయిర్ కట్, స్నానం చేయించి పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
ఈ నేపథ్యంలోనే లూథియానా(Ludhiana)లో ఓ వ్యక్తి పెంపుడు జంతువులను తీర్చిదిద్దడం కోసం వినూత్నంగా ఆలోచించి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. అది ఏంటంటే ఇంటి వద్దకే వచ్చి మీ పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దడం. అందుకోసం వారు ప్రత్యేక వ్యాన్‌ను సైతం సిద్ధం చేశారు. "హమ్ తుమ్ ఔర్ పూంచ్(Hum Tum Aur Poonch)" పేరుతో పింక్ మొబైల్ గ్రూమింగ్ వ్యాన్(Moving Van) ఏర్పాటు చేసి అవసరం ఉన్న వారి ఇళ్లకు వెళ్లి జంతువులకు స్నానం చేయించడం లేదా హెయిర్ కట్ సహా అనేక సేవలను అందిస్తున్నారు. ఆ వ్యాన్‌లో షాంపూలు, బ్రష్‌లు, క్లిప్పర్లు, డ్రైయర్‌ల వరకు జంతువుల వస్త్రధారణకు సంబంధించిన అన్ని ఉపకరణాలు అందులో ఉన్నాయి.
అయితే ఈ వ్యాపారం(business) గురించి ఓ వ్యక్తి సోషల్ మీడియా(social media) వేదికగా ఓ చిత్రం పోస్ట్ చేసి వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని, దీనికి టెక్నాలజీ సాయం కూడా అవసరం లేదని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఐడియా సూపర్ అని, ఇకపై జంతువల కటింగ్ కోసం సెలూన్‌కి వెళ్లాల్సిన పనిలేదని అంటున్నారు. అంతేకాదు జంతువులను తీసుకెళ్లే రవాణా ఇబ్బందులను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం మాకు అనుభవం లేదని పేర్కొన్నారు. మార్జిన్ తక్కువగా ఉంటుందని ఇంకో వ్యక్తి అన్నారు. అయితే ఈ వ్యాపారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్(comment) రూపంలో తెలియజేయండి మరి.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News