Home » Puttaparthi
మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ సప్లై ప్లాంటు వద్ద సత్యసాయికార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివా రం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.... తమకు గౌరవ వేతనం ఆర్నెల్ల నుంచి అందించకపోవడంతో కుటుం బాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మట్టిని తింటూ నిరసన తెలిపారు.
నల్లమాడ మండలంలోని ఎర్రవంకపల్లి, వేళ్లమద్ది, రెడ్డిపల్లి, నల్లశింగయ్యగారిపల్లి, దొన్నికోట, పులగంపల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ మండల కన్వీనర్ మైలేశివశంకర్, నాయకులు కేశవరెడ్డి, వెంకటరమణనాయుడు, గంగులప్పనాయుడు, పెద్దప్పయ్యనాయుడు, సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, కులశేఖర్‌నాయుడు, రాజారెడ్డి, బుట్టి నాగభూషణనాయుడు, ప్ర సాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు, నాయకులు సమష్టిగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన అందిస్తున్నాని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేర్కొన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రతినెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను శనివారం 31వ తేదీనే పంపిణీ చే శారు. మండలంకేంద్రంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి సహకారం అందించాలని, 30 నూతన బస్సులు కేటాయించాలని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కోరారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో గురువారం మంత్రిని కలిసి మడకశిర నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 2009 వ సంవత్సరంలో మడకశిర డిపోను ఏర్పాటు చేశారని, నేటికీ ఈప్రాంత అవసరాలకు త గ్గట్టుగా బస్సులను నడపడం లేదన్నారు.
మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో ఉప్పర తిప్పన్న అనే రైతుకు చెందిన పాప్‌కార్న్ మొక్కజొన్న పంటపై బుధవారం అర్ధరాత్రి అడవి పందు లు దాడిచేశాయి. దీంతో రూ.లక్ష పంట నష్టం వాటిల్లినట్లు బాఽధిత రైతు తెలిపాడు. ఉప్పర పోతన్నకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. బోరుకింద మొక్కజొన్న సాగుచేశాడు.
మండలంలోని గుట్టూరు వెంకటరెడ్డిపల్లి, మావటూరు, తదితర ప్రభుత్వ పాఠశాలలో తెలుగు బాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా పాఠశాలల్లో సాంస్కృతి కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
హిమాచల్ప్రదేశకు చెందిన 500 మంది భక్తులు శనివారం పర్తియాత్ర పేరుతో ప్రశాంతినిలయం చేరుకున్నారు. సాయికుల్వంత సభా మండపంలో సాయంత్రం భక్తిగీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే బాలవికాస్ విద్యార్థులు శివపురాణం, మహాభారతంలోని భక్తి పాటలకు నృత్యప్రదర్శన చేశారు. గంటపాటు సంగీతం, నృత్యాలతో అలరించారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సర్వాంగ సుందరంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ముస్తాబైంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి ప్రశాంతి నియానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వచ్చారు.
హిమాచల్‌ప్రదేశ గవర్నర్ శివప్రసాద్శుక్ల శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రాత్రి 10.40గంటకు ప్రశాంతినియలంలోని శాంతిభవనకు చేరుకున్నారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టరు టీఎస్ చేతన, ఎస్పీ వి రత్న, అడిషనల్ ఎస్పీ విష్ణు, ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ భాగ్యరేఖ ఆయనకు పుష్ఫగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్లో కేక్‌నుకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.