Share News

SP RATNA : శాంతి పురంగా పేరుతెద్దాం

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:59 PM

హిందూపురాన్ని శాంతి పురంగా పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. వి నాయక నిమజ్జనం శాంతి యుతంగా జ రపాలని సూచించారు. స్థానిక కేవీఆర్‌ ఫంక్షన హాల్‌లో ఎస్పీ బుధవారం హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు వివిధ మతాలు కులస్తులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్‌ తరువాత హిందూపురం వినాయక ని మజ్జనం రెండో స్థానంలో ఉందన్నారు.

SP RATNA : శాంతి పురంగా పేరుతెద్దాం
SP Ratna speaking in the meeting

హిందూపురం అర్బన, సెప్టెంబరు 4: హిందూపురాన్ని శాంతి పురంగా పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. వి నాయక నిమజ్జనం శాంతి యుతంగా జ రపాలని సూచించారు. స్థానిక కేవీఆర్‌ ఫంక్షన హాల్‌లో ఎస్పీ బుధవారం హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు వివిధ మతాలు కులస్తులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్‌ తరువాత హిందూపురం వినాయక ని మజ్జనం రెండో స్థానంలో ఉందన్నారు.


ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. పురంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జన వేడుకలు మంచి పండుగ వాతావరణంలో జరగాలని కోరారు. అహింసో పరమో ధర్మహః అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆచారాలను గౌరవిస్తూనే.... ఇతర మతాల వారి ఆచారాలను గౌర వించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తున్న ఇలాంటి దేశంలో ఉన్న మనం శాంతి కాముకులుగా మెలగాల న్నారు. నిర్వహుకులు డీజేలకు, బ్యాం డు సెట్లకు పెట్టే ఖర్చుతో మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్‌ లాంటి పోటీలను నిర్వహించాని పే ర్కొన్నారు. ఇతరులకు ఇబ్బంది కలి గించేలా మైక్‌సెట్‌లను ఉపయోగించ వద్దన్నారు. గుడికి భక్తితో వెళ్లాలే గానీ... మద్యం, గంజాయి లాంటివి తాగి వెళ్లకూడదని సూచించారు. పట్ట ణంలో జరిగే వినా యక ఉత్సవిలను కలిసికట్టుగా నిర్వ హించాలన్నారు. ఎవరైనా గొడవలు సృష్టించేందు ప్రయత్నిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చ రించారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్‌, సీఐలు రాజగోపాల్‌నాయుడు, జనార్దన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 11:59 PM