TALENT : పురంవాసి ప్రతిభ
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:14 AM
పట్టణానికి చెందిన నృత్యకారిణి చంద్రబాను చతుర్వేది భరతనాట్యంలో ప్రతిభ కనబరచి, అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఉత్తరప్రదేశలోని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో సోమవారం నిర్వహించి న అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఆమె తన బృందంతో కలిసి పాల్గొన్నారు. 9 వేల మంది నృత్యకారిణులు భరతనాట్యం, కూచిపూడి, కథక్ తదితర నృత్యాలు చేశారు.
హిందూపురం అర్బన, సెప్టెంబరు 2: పట్టణానికి చెందిన నృత్యకారిణి చంద్రబాను చతుర్వేది భరతనాట్యంలో ప్రతిభ కనబరచి, అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఉత్తరప్రదేశలోని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో సోమవారం నిర్వహించి న అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఆమె తన బృందంతో కలిసి పాల్గొన్నారు. 9 వేల మంది నృత్యకారిణులు భరతనాట్యం, కూచిపూడి, కథక్ తదితర నృత్యాలు చేశారు. ఇందులో ప్రతిభ కనబరిచినందుకు మృదంగ విద్వాంసుడు, పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తర్వలో మలేసియాలో నిర్వహించే నృ త్యపోటీల్లో ఆమె పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి నృత్యకారినులతోపాటు మలేసియా, కాలిఫోర్నియా తదితర దేశాల నుంచి కూడా నృత్యకారిణులు వచ్చారు.