Home » R Krishnaiah
బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం తెగించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనలోపు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాల్సిందేనని, లేనట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని, అగ్నిగుండంగా మారుతామని అఖిలపక్ష బీసీ నేతలు పేర్కొన్నారు. గురువారం బీసీల డిమాండ్ల సాధనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది.
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీ కుల గణన చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
నామినేటెడ్, కార్పొరేషన్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)కి రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) లేఖ రాశారు.
బీసీలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 29వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. బీసీల చైతన్యం కోసం ఏపీ వ్యాప్తంగా పర్యటించానని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
Andhrapradesh: ఏపీలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఆర్.కృష్ణయ్య ఒక్కరికే ఎంపీ సీట్ ఇవ్వడమా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో ఎవ్వరు చేయనంత మోసం చేశారన్నారు. ఈ అంశం మీద ఆర్ కృష్ణయ్య తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాల నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30వ తేదీలలో చలో ఢిల్లీ , పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అన్నివర్గాల ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందని.. ప్రజల పోరాటం ఫలితంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R Krishnaiah ) అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రం తొలిగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన శనివారం నాడు సమావేశం నిర్వహించారు.