Home » Rains
ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు..
ఆంధ్రప్రదేశ్ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల థాటికి విజయవాడ విల విల్లాడుతున్న సంగతి తెలిసిందే..
రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు.
గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.
వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు.
భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం కాగా.. మరికొన్ని జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి.. తమ వంతుగా సాయం చేయడానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాల పెద్దలు ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. ఇక ‘మేము సైతం’ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ముందుకొచ్చి కొండంత సాయం చేసింది...
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..!
తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే వరదలు అతలాకుతలం చేయగా.. భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది.