Share News

Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

ABN , Publish Date - Sep 08 , 2024 | 06:07 PM

గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.

 Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

హైదరబాద్: గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ ప్రతినిధులు ఖమ్మం మున్నేరు వరద బాధితుల కోసం ఆ సంస్థ తరపున నిత్యావసర కిట్లను ఈరోజు(ఆదివారం) అందజేశారు.


రూ. 3000 విలువ చేసే ఈ కిట్లలో ప్రజలకు కావాల్సిన బియ్యం, పప్పులు, నూనే ప్యాకెట్లు, చక్కెర, ఉప్పు, కారం లాంటి నిత్యావసర సరుకులతో పాటు టవల్స్ కూడా కిట్లలో పెట్టి ఖమ్మం జిల్లాకు పంపించారు. మొత్తం రూ. 3 కోట్లతో సుమారు 10,000 వేల కిట్లను ఈ రోజు(ఆదివారం) సెక్రటేరియట్ ప్రాంగణం నుంచి ఖమ్మం జిల్లాకి వాహనాలు బయలుదేరాయి. ఖమ్మానికి చేరిన వెంటనే ఈ కిట్లను వరద భాదితులకు సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,.. ఇలాంటి క్లిష్ట సమయంలో మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఖమ్మం జిల్లాలో కిట్లు సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున, ఖమ్మం ప్రజల తరపున ధన్యావాదాలు. ఈ ఆపత్కాలంలో మరిన్ని ప్రైవేట్ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 08 , 2024 | 06:12 PM