Home » Rajanagaram
రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్రగాయాల పాలై రోడ్డుపై పడి ఉంది.. అటుగా వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆ ఘటన చూసి చలించిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) వైసీపీ (YSRCP) ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితి. ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరూ గెలవలేదు. తిరుగులేదనుకున్న నేతలు సైకిల్, గ్లాస్ సునామీకి చతికిలపడ్డారు...
ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. పోలింగ్‌కు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఒకటి లేదా రెండు రోజుల ముందు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు నోట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి తెరలేపుతుంటారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్లుకు నోట్లు పంచడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ.. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నోట్ల పంపిణీకి శ్రీకారం చుడతాయి. ఈసారి వైసీపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడంతో.. కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు ఇప్పటికే పంపకాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.