Home » Rajya Sabha
లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రానప్పటికీ.. ప్రధాన పార్టీలు తమ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా..
ముగ్గురు వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు విజయరాజు వెల్లడించారు.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ అదివారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి శ్రీమతి (డాక్టర్) ధర్మశీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి శ్రీ సుభాష్ బారాల, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాసా బాండగే పోటీ చేయనున్నారు.