Share News

BJP: పీయూష్ స్థానంలో జేపీ నడ్డా.. రాజ్యసభ పక్ష నేతగా నియామకం

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:59 PM

రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను(JP Nadda) ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్(Piyush Goyal) స్థానంలో ఆయన్ని నియమించింది.

BJP: పీయూష్ స్థానంలో జేపీ నడ్డా.. రాజ్యసభ పక్ష నేతగా నియామకం

ఢిల్లీ: రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను(JP Nadda) ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్(Piyush Goyal) స్థానంలో ఆయన్ని నియమించింది.


గోయల్ జులై 5, 2010న రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2021 జులై 14న ఆయన్ని రాజ్యసభ సభా నాయకుడిగా ప్రకటించారు. జూన్ 4న లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, జూన్ 24న దిగువ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. JP నడ్డా తొలిసారిగా 2012, ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికయ్యారు. జూన్ 24న ఆయనను సభ పక్ష నేతగా నియమిస్తూ పార్టీ నిర్ణయించింది.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 05:13 PM